: దేశంలో అతిపెద్ద టోర్నీ ఇదేనేమో!

జాతీయ స్థాయిలో అతిపెద్ద టోర్నీ నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం పూనుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఒడిశా, ఛత్తీస్ గఢ్, జార్ఖాండ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని యువత తుపాకులు కాకుండా హాకీస్టిక్స్‌ చేత పట్టాలన్న స్ఫూర్తితో హాకీ వెటరన్‌ డిఫెండర్‌, బిజూ జనతాదళ్‌ ఎంపీ దిలిప్‌ టిర్కే వినూత్న రీతిలో అతిపెద్ద హాకీ టోర్నీ నిర్వహణకు పూనుకున్నారు. ‘బిజూ పట్నాయక్‌ గ్రామీణ హాకీ’ పేరుతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ మూడు రాష్ట్రాల నుంచి సుమారు 1,300 పైగా జట్లు, 25,000 మంది క్రీడాకారులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఉప రాష్ట్రపతి హమీద్‌ హన్సారీ చేతులు మీదుగా డిసెంబర్‌ 10న రూర్కెలాలో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఫైనల్స్ మార్చిలో నిర్వహించనున్నారు. విజేతకు 30,00,000 రూపాయలు నజరానాగా అందజేయనున్నారు. దీంతో గిరిజన యువత జీవితాల్లో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News