: పద్మనాభ స్వామి ఆలయ సంప్రదాయాల విషయంలో ప్రధాన పూజారి మాటే వినాలి!: కేరళ హైకోర్టు

అనంత పద్మనాభ స్వామి ఆలయ సంప్రదాయాల విషయంలో ప్రధాన పూజారి చెప్పిన నియమాలనే తప్పనిసరిగా పాటించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆలయానికి వచ్చే మహిళా భక్తుల వస్త్రధారణ విషయమై దాఖలైన రెండు పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. అనంతరం వెలువరించిన తీర్పులో ఈ విషయాన్ని హైకోర్టు పేర్కొంది. ఈ ఆలయానికి వచ్చే మహిళా భక్తులు చీరలు, వదులుగా ఉండే ధోతి తరహా దుస్తులే ధరించాలని, చుడీదార్ లాంటి ఒంటికి అతుక్కుని ఉండే దుస్తులను ధరించడానికి వీలులేదని ఆ తీర్పులో పేర్కొంది. ఆలయ సంప్రదాయాల విషయంలో ప్రధాన పూజారిదే చివరిమాట అని, అక్కడి ఉద్యోగులైన ప్రభుత్వ అధికారులకు ఆ నిబంధనలను మార్చే అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. కాగా, నవంబర్ 29న కెఎన్ సతీశ్ అనే ఆలయ అధికారి చుడీదారులు ధరించి వచ్చిన భక్తులను ఈ ఆలయంలోకి అనుమతించారు. దీనిని సవాల్ చేస్తూ, కొందరు భక్తులు కేరళ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

More Telugu News