: చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ముఖ్యమంత్రుల కమిటీ సమావేశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ముఖ్యమంత్రుల కమిటీ సమావేశం కానుంది. ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఈ కమిటీ తొలి భేటీ జరగనుంది. కరెన్సీ లావాదేవీలను నివారించి, నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ చర్చించనుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నెలకొన్న ఇబ్బందులను కూడా ఈ కమిటీ చర్చిస్తుంది. ఈ కమిటీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్వీనర్ కాగా... ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ లు సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా, సీఈవో అమితాబ్ కంత్ లు కూడా సభ్యులుగా ఉన్నారు.

More Telugu News