: బియ్యం వాడకం మరీ ఎక్కువైపోయింది: కోడెల

చిరుధాన్యాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయని ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ఆహారజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మహిళలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. మహిళల ఆరోగ్యం మరింత ఆరోగ్యవంతమైన సమాజానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. గతంలో అందరూ ఆహారంలో చిరు ధాన్యాలు ఎక్కువగా తీసుకునే వారని ఆయన గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో ఆహారంలో వరి బియ్యం వాడకం మరీ ఎక్కువైపోయిందని ఆయన హెచ్చరించారు. చిరుధాన్యాల్లోనే అన్ని రకాల పోషక విలువలు దాగి ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. అందుకే చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని ప్రతిఒక్కరూ ఎంపిక చేసుకోవాలని ఆయన చెప్పారు. మరీ ముఖ్యంగా మహిళల్లో తలెత్తే రక్తహీనత పోవాలంటే చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఆయన తెలిపారు.

More Telugu News