: హైద‌రాబాద్‌లో రూ.2.95 కోట్ల నగదును మార్చిన నలుగురు పోస్టల్ అధికారుల అరెస్టు

హైద‌రాబాద్‌లోని పోస్టాఫీసుల్లో జ‌రుగుతున్న‌ న‌గ‌దు మార్పిడిలో పెద్ద ఎత్తున అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం అందుకున్న సీబీఐ అధికారులు మొత్తం 11 చోట్ల దాడులు జ‌రిపి అన్ని వివరాల‌ను సేక‌రించారు. చ‌ట్ట‌విరుద్ధంగా ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన పోస్ట‌ల్ అధికారులు అబ్దుల్ గనీ, జి.రవితేజ, సురేశ్‌కుమార్‌, జి.శ్రీ‌నివాస్‌ల‌ను అరెస్టు చేశారు. వీరంతా సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ ప్రోత్సాహంతోనే నగదు మార్చారని అధికారులు గుర్తించారు. మొత్తం రూ.2.95 కోట్ల నగదును అక్ర‌మంగా మార్చార‌ని చెప్పారు. అధికారుల ఇళ్లు, ఆఫీసుల‌తో పాటు ప‌లు ప్రాంతాల్లోనూ తాము సోదాలు జ‌రిపిన‌ట్లు తెలిపారు. తాము జ‌రిపిన దాడుల్లో మొత్తం 17.5 ల‌క్ష‌ల విలువైన రూ.2 వేల కొత్త నోట్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

More Telugu News