: వెయ్యి నోట్ల పునరుద్ధరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: ఆర్బీఐ

వెయ్యి నోట్ల పునరుద్ధరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన చేసింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల కష్టాలను తీర్చేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించింది. రెండు వారాలుగా రూ.500, రూ.100 నోట్ల ముద్రణ పెంచామని, దేశంలోని అన్ని ప్రాంతాలకు నోట్ల పంపిణీకి చర్యలు చేపట్టామని ఆ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 5వ తేదీ మధ్య కాలంలో 19.1 బిలియన్ల నోట్ల పంపిణీ చేశామని, గత మూడేళ్లలో పంపిణీ చేసిన మొత్తం కంటే ఈ విలువ ఎక్కువ అని తెలిపింది. సాధారణ పరిస్థితులు వస్తే నగదు ఉపసంహరణపై పరిమితులు ఎత్తివేస్తామని ఆ ప్రకటనలో ఆర్బీఐ స్పష్టం చేసింది.

More Telugu News