: సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఆజంఖాన్ క్షమాపణలను తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం!

ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బులంద్ షహర్ లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానంలో ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆజంఖాన్ క్షమాపణలు కోరగా, కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే, గత జూలైలో బులంద్ షెహర్ గ్రామంలో తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది బందిపోట్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఖండించాల్సిన ఆజంఖాన్... ఈ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయనపై కేసు నమోదైంది. అంతేకాదు, బాధిత బాలికను డిగ్రీ వరకు చదివించేందుకు అవసరమైనంత ఖర్చును తాను భరిస్తానంటూ ఆజంఖాన్ ముందుకు రాగా... సదరు బాలిక తిరస్కరించింది.

More Telugu News