: నాలుగు వేలకు పైగా అశ్లీల వెబ్ సైట్లపై వేటు వేసిన ‘చైనా’

హింస, అశ్లీల, అసభ్య సమాచారంతో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారాలు చేస్తున్న వెబ్ సైట్లపై చైనా ప్రభుత్వం వేటు వేసింది. సుమారు నాలుగు వేలకు పైగా వెబ్ సైట్లను తొలగించింది. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. కొత్తగా వచ్చిన సైబర్ స్పేస్ నిబంధనలకు విరుద్ధంగా ఈ వెబ్ సైట్లు ఉండటంతో వాటిని తొలగించినట్లు జిన్ హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కాగా, ఇంటర్నెట్ వ్యవస్థకు భద్రత కల్పించే నిమిత్తం ఈ చర్యలు తీసుకున్నట్లు చైనా అధికారిక వర్గాలు తెలిపాయి. సామాజిక పద్ధతులకు విఘాతం కలిగించకూడదన్న ఉద్దేశంతో, పోర్నోగ్రఫీ సహా వ్యర్థ సమాచారాన్ని ఏ వెబ్ సైటూ అందించకుండా చైనా ప్రభుత్వం నవంబర్ లో సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి నియమ, నిబంధనలను తీసుకొచ్చిందని చెప్పాయి.

More Telugu News