: తెలంగాణలోని జన్ ధన్ ఖాతాల్లోకి 514 కోట్లు

బ్యాంక్ అకౌంట్లు లేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం తెరిపించిన బ్యాంక్ అకౌంట్లే జన్ ధన్ ఖాతాలు. అప్పటి వరకు బ్యాంకులకు వెళ్లని వారు కూడా... జన్ ధన్ ఖాతాలు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం పొదుపు చేసుకోవడం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 83 లక్షల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 8వ తేదీ నాటికి ఈ ఖాతాల్లో రూ. 958 కోట్ల నగదు జమ అయింది. 23.77 లక్షల అకౌంట్లలో ఎలాంటి డిపాజిట్లు లేవు. కానీ నోట్లు రద్దయిన తర్వాత... తెలంగాణ జన్ ధన్ ఖాతాల్లో గత 22 రోజుల్లో ఏకంగా రూ. 514 కోట్లు జమ అయ్యాయి. ఇంకొక విషయం ఏమిటంటే... నోట్ల రద్దు తర్వాత 1.53 లక్షల జన్ ధన్ ఖాతాలు పెరిగాయి. ఎక్కువ డబ్బు జమ అయిన ఖాతాల వివరాలను ఆర్బీఐకి పంపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

More Telugu News