: బంగాళాఖాతంలో వాయుగుండం...తుపానుగా మారే ప్రమాదం

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది పెను తుపానుగా మారనుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 1320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఇది మరో 72 గంటల్లో పశ్చిమ వాయవ్యదిశగా కదలచ్చని, ఈ క్రమంలో ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని హెచ్చరించారు. రానున్న రెండు రోజుల్లో అంటే 48 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం తుపానుగా మారే ప్రమాదం ఉందని వారు తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వీస్తున్న చలిగాలులతో ఉష్ణోగ్రతలు అత్యల్పస్థాయిలో నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాయుగుండం, తుపాను మరెన్ని చిక్కులు తెస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

More Telugu News