: ఫ్రాన్స్‌ ప్రధానమంత్రిగా బెర్నార్డ్‌ కజెనూవ్ నియామకం

ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోన్న బెర్నార్డ్‌ కజెనూవ్ ఈరోజు ఫ్రాన్స్‌ ప్రధానమంత్రిగా నియ‌మితుల‌య్యారు. ఈ విష‌యాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హొలాండే ఈ రోజు ప్రకటించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఫ్రాన్స్‌ ప్రధానమంత్రి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన‌ మాన్యుల్‌ వాల్స్ వ‌చ్చే ఏడాది జరగనున్న ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ తరపున పోటీకి దిగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాజీనామా చేశార‌ని, ఆయన స్థానంలో బెర్నార్డ్‌ కజెనూవ్ ను నియ‌మించామ‌ని చెప్పారు. బెర్నార్డ్‌ను ఎంతో స‌మ‌ర్థ‌త‌, అనుభ‌వం ఉన్న వ్య‌క్తిగా హోలాండే కార్యాల‌యం అభివ‌ర్ణించింది.

More Telugu News