: తనకు ఎంతో ఇష్టమైన వాజ్ పేయీ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు ‘అమ్మ’ఎంతో బాధపడ్డారట

తనకు ఎంతో ఇష్టమైన నేత అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వాన్ని కూల్చడంలో నాడు కీలక పాత్ర పోషించిన జయలలిత, ఆ తర్వాత ఎంతో బాధపడ్డారట. ఈ విషయమై ఆమె ఎన్నోసార్లు పశ్చాత్తాప పడ్డారని జయలలిత సన్నిహితులు చెబుతుంటారు. కాగా, 1999లో వాజ్ పేయీ సర్కారు ఒక్క ఓటు తేడాతో నాడు కూలిపోవడానికి కారణం జయలలితే. ‘అమ్మ’కు నాటి స్నేహితుడు, ఆ తర్వాత బద్ధశత్రువుగా మారిన సుబ్రహ్మణ్యస్వామి చెప్పిన మాటలు విని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో జయలలిత కలవడంతో ఒకేఒక్క ఓటు తేడాతో వాజ్ పేయి సర్కార్ నాడు కూలిపోయింది.

More Telugu News