: జయలలితను ఒక్కొక్కరు ఒక్కో పేరుతో కీర్తించారు!

జయలలిత సాహసపూరిత జీవితాన్ని దేశంలోని ప్రతిపార్టీ కీర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెను 'ఫైటర్' అని సంబోధించారు. ఆమె ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తుదిశ్వాస వరకూ పోరాటం సాగించారని అన్నారు. స్పీకర్ సుమిత్రామహాజన్ ఆమెను 'పరిపాలనా దక్షురాలు' అని పేర్కొన్నారు. తలైవా రజనీకాంత్ అయితే ఆమెను 'సాహసపుత్రిక' అని కొనియాడారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ జయలలితను 'డార్లింగ్ ఆఫ్ మాసెస్' అని సంబోధించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెను 'పీపుల్స్ సీఎం' అని కీర్తించారు. గులాంనబీ ఆజాద్ ఆమెను 'షైనింగ్ స్టార్'గా అభివర్ణించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ 'స్పెషల్ సీఎం' అని, 'ఫైటర్ ఉమన్' అని సంబోధించారు. ఈ సంబోధనలన్నీ జయలలిత వ్యక్తిత్వానికి సూచనలుగా నిలుస్తున్నాయి. ఆమెలోని పోరాటతత్వాన్ని, రాజీలేని అవిశ్రాంత పోరాటాన్ని సూచిస్తున్నాయి.

More Telugu News