: జయలలిత ప్రభావం... మీడియాలో 'బ్లాక్ డే' న్యూస్ లేదు, కరెన్సీ కష్టాల కథనాలు లేవు!

దాదాపు నెల రోజుల నుంచి ఉదయం టీవీలో న్యూస్ చానల్ పెట్టగానే కనిపించేది ఒకటే దృశ్యం. బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద బారులు తీరిన క్యూలైన్లు. ఆపై ప్రత్యేక కథనాలు. చిల్లర కష్టాలకు సంబంధించిన వార్తలకే పెద్ద పీట. నేడు మాత్రం పరిస్థితి సమూలంగా మారింది. టీవీ చానల్సన్నీ చెన్నై నుంచి జయలలిత మృతికి సంబంధించిన వార్తలు, కథనాల ప్రత్యక్ష ప్రసారానికి పరిమితం అయ్యాయి. నేటి దినపత్రికలు ఆమె గురించి ప్రత్యేక పేజీలు ప్రచురించాయి. ఇక మరో ముఖ్యమైన అంశం నేడు డిసెంబర్ 6. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా ముస్లింలు 'బ్లాక్ డే' నిర్వహించే రోజు. మామూలుగా అయితే, ఈ సరికి పోలీసులు, అందుబాటులో ఉన్న సైన్యం సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరింపు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తీసుకున్న కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తదితరాలపై కథనాలు ప్రసారమయ్యేవి. ముఖ్యంగా హైదరాబాద్ లో జామా మసీదు వద్ద ఏర్పాట్లపై వార్తలు వచ్చేవి. కానీ నేడు జయలలిత మరణం ప్రభావం అటు నోట్ల రద్దుని, ఇటు బ్లాక్ డేను దూరం చేసిందనే చెప్పాలి.

More Telugu News