: హీరోయిన్ గా తొలి చిత్రానికే 'ఏ' సర్టిఫికెట్... తన చిత్రాన్ని తానే చూడలేకపోయిన జయ... ఆసక్తికర విశేషాలు!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం అందరికీ తెలిసిన, తెరచిన పుస్తకమేమీ కాదు. ఆమె జీవితంలో చాలా మందికి తెలీని ఎన్నో విశేషాలున్నాయి. వాటిల్లో కొన్ని ఇవి. * తొలిసారి హీరోయిన్ గా 'వెన్నిర ఆడై' చిత్రంలో జయ నటించగా, ఆ చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ లభించింది. * అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలే కావడంతో థియేటర్ లో తన సినిమాను ఆమె చూడలేకపోయారు. * టాప్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత హిందీలో ధర్మేంద్ర సరసన 'ఇజ్జత్'లో నటించారు. * 1961లో మాజీ రాష్ట్రపతి వీవీ గిరి కుమారుడు శ్రీ శంకర్‌ గిరి నిర్మించి, దర్శకత్వం వహించిన ‘ఎపిస్టిల్‌’ అనే ఆంగ్ల లఘు చిత్రంలో జయ నటించారు. * తమిళ చిత్రాల్లో స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని, జలపాతంలో తడిసి, కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన తొలి తార జయలలితే. * కర్ణాటకలో పుట్టినప్పటికీ, జయకు తమిళులంటేనే ప్రేమ. కావేరీ నీటిపై ఆమె కన్నడిగులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఆపై కర్ణాటకలో షూటింగ్ కు వెళితే, ప్రజలు అడ్డగించి క్షమాపణలు కోరిన వేళ, ససేమిరా అన్న ధీశాలి. ఆ సమయంలో ప్రజలు రాళ్లు విసిరినా, ఆమె క్షమాపణలు చెప్పలేదు. * సినిమా అవకాశాలు తగ్గి, శోభన్ బాబుతో ప్రేమ విఫలమైన వేళ, ఆత్మహత్య చేసుకోవాలని కూడా జయలలిత ప్రయత్నించారు. * ఇంగ్లీషు నవలలు అధికంగా చదివే జయ, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఆ అలవాటు మానుకోలేదు. * తమిళ పత్రికల్లో 'థాయ్' పేరున జయలలిత వ్యాసాలు రాస్తుంటారు. ఓ నవల కూడా రాశారు. * తన వద్ద తోటపనిచేసే బాలుడిని చేరదీసి, ఉన్నత చదువులు చదివించారామె. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన సమాచారం బట్టి, ఆ యువకుడు 'అమెజాన్' కంపెనీలో ఉన్నతోద్యోగి. * మూడేళ్ల వయసులోనే భరత నాట్యం నేర్చుకున్న ఆమె, తరువాత మోహిణి హట్టం, మణిపూరి, కథక్‌ నృత్యాల్లో శిక్షణ పొందారు.

More Telugu News