: ‘అమ్మ’ మృతి చెందారన్న వదంతిని ముందుగా ప్రసారం చేసింది ‘జయ’ టీవీనే!

తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి చెందారనే వదంతిని ముందుగా ప్రసారం చేసింది ‘జయ’ టీవీయేనట. ఈ రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆమె కన్నుమూశారనే వార్తను జయలలిత టీవీ గ్రూప్ నకు చెందిన ‘జయ ప్లస్’లో ప్రసారం చేసింది. ఆమె సొంత ఛానెలే ఈ వార్తను ధ్రువీకరించడంతో మిగతా తమిళ ఛానెళ్లతో పాటు జాతీయ మీడియా కూడా అదే వార్తను ప్రసారం చేశాయి. అంతేకాకుండా, అన్నాడీఎంకే కార్యాలయంలో పార్టీ జెండాను అవనతం చేశారు. ఈ రెండు విషయాలతో జయలలిత మృతి చెందినట్లుగానే భావించారు. అయితే, తమ అభిమాన నాయకురాలు చనిపోయిందనే వార్తను జీర్ణించుకోలేకపోయిన ‘అమ్మ’ అభిమానులు అప్పటికే అపోలో ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన తమిళ సర్కారు జయలలిత మరణ వార్త నిజం కాదని చెప్పాల్సిందిగా అపోలో వైద్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకే అపోలో వైద్యులు తాజా ప్రకటన చేయడం జరిగిందని సమాచారం.

More Telugu News