: 24 లేదా 48 గంటల్లో తేలుతుంది...అద్భుతాలు జరగడానికి ఆ సమయం చాలు!: అపోలో వైద్యులు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అందుతున్న చికిత్స అత్యంత అధునాతనమైనదని అపోలో వైద్యులు తెలిపారు. గతంలో ఉన్న వైద్యవిధానాలను మెరుగుపరుస్తూ రూపొందించిన అత్యున్నత వైద్య విధానంతో ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నామని వారు చెప్పారు. ఈ విధానంలో శరీరంలోని అన్ని అవయవాలకు సరైన పద్ధతిలో రక్తప్రసరణ జరపడంతోపాటు, ఊపిరితిత్తులు చేయాల్సిన పనిని కూడా ఆమెకు అందుబాటులో ఉంచిన మెషీన్ నిర్వర్తిస్తుందని, దీంతో శరీరంలోని అన్న అవయవాలు చేయాల్సిన పనులు చేస్తాయని వారు తెలిపారు. తద్వారా బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుందని వారు చెప్పారు. వీటన్నిటినీ ఈ మెషీన్ చక్కబరుస్తుండగా, వైద్యులు తాము చేయాల్సిన ఇతర పనులు చక్కబెట్టేస్తారని, దీంతో ఎలాంటి రోగైనా మెరుగుపడడం సర్వసాధారణంగా జరుగుతుందని, అయితే ఆమె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరారన్న విషయం గుర్తుంచుకోవాలని, ఆమెకు ఇంతకు ముందు ఇచ్చిన వైద్యంతో ఆమె శరీరం వైద్యానికి పూర్తి స్థాయిలో సహకరిస్తుందా? అన్నదే సమస్య అని, ఇలా అన్ని సమస్యలు అధిగమించి అద్భుతం జరుగుతుందని అంతా ఆశిస్తున్నామని వారు వివరించారు. ఇదంతా జరిగేందుకు కనీసం 24 గంటల సమయం పడుతుందని, కొన్నిసార్లు 48 గంటల సమయం కూడా పడుతుందని, అది రోగి కండిషన్ పై ఆధారపడి ఉంటుందని వారు వెల్లడించారు. దీనిపై తొందరపడి పుకార్లు రేపవద్దని వారు సూచించారు. వైద్యులు వాస్తవం చెబుతారని అంతా గుర్తించాలని వారు తెలిపారు.

More Telugu News