: 'మేకిన్ ఇండియా'పై ట్రంప్ ఎఫెక్ట్... అమెరికన్ కంపెనీలకు డెడ్లీ వార్నింగ్

భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మేకిన్ ఇండియా' కార్యక్రమానికి ట్రంప్ గ్రహణం పట్టేట్టుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో 'మేకిన్ ఇండియా' భవిషత్యే ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా కంపెనీలు ఏవైనా సరే తమ ఉద్యోగాలను ఔట్ సోర్స్ చేసినా, విదేశాల్లో ఫ్యాక్టరీలను నిర్మించినా కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. అలాంటి కంపెనీల ఉత్పత్తులపై ఏకంగా 35 శాతం పన్ను విధిస్తామని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. 'మేకిన్ ఇండియా'లో భాగస్వామ్యం కావాలని పలు అమెరికన్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇండియాలో ఫ్యాక్టరీలను నిర్మించాలనే దిశగా... ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ట్రంప్ చేసిన హెచ్చరిక భారత్ తో పాటు, పలు అమెరికన్ కంపెనీలకు శరాఘాతంగా మారింది. తమ మాటని కాదని అడుగు ముందుకేస్తే... 'ఎక్స్ పెన్సివ్ మిస్టేక్' చేసినవారవుతారంటూ అమెరికన్ కంపెనీలకు ట్విట్టర్లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

More Telugu News