: ‘విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు’.. అమెరికా కంపెనీలకు హెచ్చరికలు చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్య‌క్ష పీఠంపై కూర్చోక‌ముందే ఆ ప‌ద‌వికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తమ దేశ కంపెనీల‌కు హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. ఇటీవ‌లే అమెరికా బ‌య‌ట పరిశ్ర‌మ‌లు పెట్టేందుకు మొగ్గుచూపే కంపెనీల‌ను వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న, తాజాగా త‌మ దేశ కంపెనీల్లో విదేశీయులకు ఉద్యోగాలిచ్చినా తీవ్ర‌ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. త‌న ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా కంపెనీలు ప‌నిచేస్తే ఆయా కంపెనీల ఉత్పత్తులపై 35 శాతం పన్ను విధిస్తానని పేర్కొన్నారు. త‌మ దేశంలో పరిశ్రమలు పెట్టి వ్యాపారాలు చేసేవారికి మాత్రం సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని, ఆ కంపెనీల‌కు పన్నులు తగ్గిస్తానని, అంతేగాక వివిధ‌ నిబంధనలను సైతం స‌డ‌లిస్తాన‌ని చెప్పారు. విదేశీయులకు ఉద్యోగాలిచ్చి త‌మ దేశ కంపెనీలు ఇలాంటి పెద్ద తప్పును చేయ‌బోవని తాను అనుకుంటున్న‌ట్లు ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

More Telugu News