: పెన్షనర్లకు రెండు రూపాయల నాణేల మూటలు ఇచ్చారు!

పెద్దనోట్ల రద్దు తరువాత దేశ వ్యాప్తంగా నగదు కొరత ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకుల్లోనే డ‌బ్బులేని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌టో తారీఖు నేప‌థ్యంలో త‌మ అకౌంట్ల‌లో ప‌డిన డ‌బ్బులు తీసుకోవడానికి దేశ వ్యాప్తంగా వేత‌న జీవులు, పింఛ‌నుదారులు బ్యాంకుల ముందు భారీగా చేరుకొని డ‌బ్బు తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎన్నో బ్యాంకుల్లో కొత్త‌ 2000, 500 రూపాయ‌ల‌ నోట్లతో పాటు 100 రూపాయ‌ల నోట్లు కూడా తెచ్చిన వెంట‌నే అయిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో పంజాబ్‌లోని జలంధర్‌లో పెన్షనర్ల చేతిలో బ్యాంకు సిబ్బంది త‌లో వెయ్యి రూపాయ‌ల రెండు రూపాయ‌ల నాణేల కవర్లు పెట్టారు. వారంద‌రూ 10 వేల రూపాయల నగదు తీసుకోవాల్సి ఉంది. అయితే 9 వేల రూపాయలకు మాత్రమే నోట‍్లను ఇచ్చి మిగిలిన 1000 రూపాయలకు ఈ నాణేలు ఇచ్చారు. బ్యాంకుకు వ‌చ్చిన పెన్ష‌న‌ర్లు అంద‌రూ ఒక్కో కవర్‌లో ఉంచిన చిల్లరను బ్యాంకుల నుంచి ప‌ట్టుకొని వెళుతూ క‌నిపించారు. ఇంత చిల్ల‌ర మేమేం చేసుకోవాలంటూ వారు వాపోయారు. చేసేదేమీ లేక చిల్ల‌ర మూట‌ను చంక‌లో పెట్టుకొని ప‌ట్టుకెళ్లారు.

More Telugu News