: సహారా ఎడారి ఒకప్పుడు పచ్చగా కళకళలాడేది: తాజా అధ్యయనంలో వెల్లడి

ప్రపంచంలో అతిపెద్ద ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారి ఒకప్పుడు పచ్చని చేలతో కళకళలాడేదని తాజాగా జరిగిన అధ్యయనం ఒకటి వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే... టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ నిర్వహించిన స్టడీలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆరువేల ఏళ్ల క్రితం సహారా ఎడారి ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడేవని, దాంతో పచ్చని మొక్కలతో ఆ ప్రాంతం కళకళలాడేదని పరిశోధకులు తెలిపారు. అకస్మాత్తుగా వాతావరణంలో సంభవించిన మార్పులు సహారా ప్రాంతం ఎడారిగా మారిపోయేందుకు కారణమయ్యాయని వారు తెలిపారు. హోలోసేన్ యుగానికి సంబంధించిన నమూనాలను ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూసి ఈ నిర్ణయానికి వచ్చామని వారు చెప్పారు. కంప్యూటర్ మోడల్స్, ఇతర డేటాను విశ్లేషించిన తరువాత సహారా ప్రాంతంలో వేల ఏళ్ల క్రితం వర్షపాతం బాగా ఉండేదని తేలినట్టు డిపార్ట్‌ మెంట్ ఆఫ్ అట్మోస్పెరిక్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ రాబర్ట్ కోర్టీ వెల్లడించారు. ప్రస్తుతం మనకు తెలిసిన సహారా ఎడారి ఆరువేల ఏళ్ల క్రితం వర్షపాత ప్రాంతమని ఆయన తెలిపారు.

More Telugu News