: ఆర్మీ వివరణతో కంగుతిన్న మమతాబెనర్జీ!

రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పశ్చిమ బెంగాల్ లోని టోల్ గేట్ ల వద్ద సైన్యాన్ని మోహరించడాన్ని తప్పుపట్టిన సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆర్మీని ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే, పశ్చిమ బెంగాల్ లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల అభ్యర్థన మేరకే ఆర్మీని మోహరించామని బెంగాల్ జీఓసికి చెందిన మేజర్ జనరల్ సునీల్ యాదవ్ చెప్పారు. ఈ మేరకు ఆయా ప్రభుత్వ కార్యాలయాలు రాసిన లేఖలను విడుదల చేశారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే కేంద్ర బలగాలను పంపడం జరిగిందని, ఈ విషయమై నవంబరు 24న అనుమతులు పొందామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం లేకుండా సైన్యాన్ని మోహరించారని చెబుతున్న మమత.. ఆర్మీ ఇచ్చిన వివరణతో కంగుతిన్నట్లయింది.

More Telugu News