: రూ.20 వేల కోట్లతో విశాఖపట్టణంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు

సుమారు రూ.20 వేల కోట్లతో విశాఖపట్టణంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు కానున్నట్లు ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓ కృష్ణ కిషోర్ వెల్లడించారు. విజయవాడలో ఫ్యాప్సీతో కలిసి వివిధ దేశాల కాన్సుల్ జనరల్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖలో నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవలే రష్యాకు చెందిన యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందని అన్నారు. దుబాయ్, అబుదాబీలోని పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా దేశాల్లో పర్యటించనున్నారని, ఈ రెండు చోట్లా సుమారు 200 మందికి పైగా అంతర్జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నట్లు తెలిపారు. కర్నూల్ లో విత్తన గారాన్ని ఏర్పాటు చేసేందుకు బ్రిటన్ కు చెందిన ఐఓవా సంస్థ ముందుకు వచ్చిందని కృష్ణ కిషోర్ పేర్కొన్నారు.

More Telugu News