: పాత 500, 1000 నోట్లను ఏం చేస్తున్నారో... తెలుసా?

గత నెల 8వ తేదీన రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత... మొత్తం 8 ట్రిలియన్ (8 లక్షల కోట్లు) రూపాయల డబ్బు బ్యాంకుల్లో జమ అయింది. ఇవన్నీ కూడా పెద్ద నోట్లే. మరి ఈ పాత నోట్లన్నీ ఎక్కడకు వెళుతున్నాయ్, వాటిని ఏం చేస్తున్నారనే డౌట్ సహజంగానే అందర్లోనూ కలుగుతుంది. అసలేం జరుగుతోందో ఓ సారి చూద్దాం. ఈ పాత నోట్లన్నీ తొలుత ఆర్బీఐకి చెందిన ఇష్యూ ఆఫీసులకు వెళతాయి. అక్కడ ఈ నోట్లు పారిశ్రామిక అవసరాలకు పనికొచ్చేలా... చిన్నచిన్క పేలికలుగా చేసి, బండిల్స్ గా చేస్తారు. అనంతరం వాటిని పరిశ్రమలకు తరలిస్తారు. తాజాగా, ఈ కరెన్సీ పీలికలను కేరళలోని కన్నూర్ జిల్లాలో ఉన్న వెస్టర్స్ ఇండియా ప్లైవుడ్స్ లిమిటెడ్ కు ఆర్బీఐ అమ్ముతోంది. 1962లో స్థాపించిన ఈ పరిశ్రమ ఈ కరెన్సీ పీలికలను పల్ప్ గా మార్చుతోంది. 5 శాతం కరెన్సీ పల్ప్ ను 95 శాతం ఉడ్ పల్ప్ తో కలిపి... హర్డ్ బోర్డ్ గా మార్చుతోంది. ఈ సందర్భంగా, వెస్టర్న్ ప్లైవుడ్స్ ఎండీ మయన్ మొహమ్మద్ మాట్లాడుతూ, కరెన్సీని రీసైకిల్ చేయడం అంత ఈజీ కాదని... దీని పల్ప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పారు. దీంతో తమ సంస్థలోని ఇంజినీర్లు కొంత రీసెర్చ్ చేసి, కొత్త విధానాన్ని కనిపెట్టారని... దీంతో, తమ పని సులువు కావడమే కాకుండా, ఖర్చు కూడా తగ్గిందని చెప్పారు. ఇప్పటి వరకు తమ వద్దకు 80 మెట్రిక్ టన్నుల కరెన్సీ పీలికలు వచ్చాయని తెలిపారు. ఇదండీ సంగతి. ఇంతకాలం మన చేత పూజలందుకున్న పాత నోట్లన్నీ హార్డ్ బోర్డులుగా మారుతున్నాయన్నమాట.

More Telugu News