: ‘మరో మూడు రోజులు ఇంతే’.. పశ్చిమ బెంగాల్‌లో మిల‌ట‌రీ బ‌లగాల మోహరింపుపై వెంక‌య్య స్పందన

ప‌శ్చిమ బెంగాల్ లోని జాతీయ రహదారులపై ఉన్న ప‌లు టోల్ బూత్ ల వద్ద కేంద్ర‌ప్ర‌భుత్వం సైన్యాన్ని మోహరించడం ప‌ట్ల తృణ‌మూల్ కాంగ్రెస్ చేస్తోన్న ఆరోప‌ణ‌లపై కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... సాధారణ తనిఖీల్లో భాగంగానే ఆయా ప్రాంతాల్లో మిలటరీ బలగాలను మోహరింపజేయడం జరిగిందని, దీన్ని రాజ‌కీయం చేయ‌కూడ‌ద‌ని చెప్పారు. మరో మూడు రోజుల పాటు ఇలాగే తనఖీలు కొనసాగుతాయని స్ప‌ష్టం చేశారు. ఆ రాష్ట్రంలో మిల‌ట‌రీ బ‌ల‌గాల మోహ‌రింపులో ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు. పార్ల‌మెంటు చ‌ర్చ‌ల్లో ఈ అంశాన్ని తీసుకొస్తూ స‌భ‌లో చ‌ర్చ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించాల‌ని అనుకుంటే తృణ‌మూల్ కాంగ్రెస్ అలాగే చేసుకోవచ్చ‌ని వ్యాఖ్యానించారు.

More Telugu News