: ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్... 160 కి.మీ స్పీడ్ తో వెళ్తూ యాక్సిడెంట్ చేసేశాడు!

యువత అత్యుత్సాహం, నలుగురిలో విభిన్నంగా ఉండాలన్న తపన ఎలాంటి నష్టం చేకూరుస్తుందో వివరించే ఘటన ఇది. అమెరికాలోని రోడ్ ఐలాండ్ పోలీసుల కథనం ప్రకారం, వేగంగా కారును నడుపుతూ ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ ప్రమాదానికి గురై చావు బతుకుల మధ్య ఉన్నాడు. 20 సంవత్సరాల ఓనాసీ ఓలియో రోజాస్ అనే యువకుడు, తన కారుతో యూఎస్ రూట్ 6పైకి వెళ్లాడు. ఫేస్ బుక్ పేజీలో 100 మైళ్ల వేగాన్ని (సుమారు 160 కి.మీ) అందుకుంటానని ముందే సవాల్ చేసి, తన ప్రయాణాన్ని లైవ్ చూపించడం ప్రారంభించాడు. కారు పూర్తి వేగాన్ని అందుకున్న తరువాత అదుపుతప్పిన కారు రోడ్డు రక్షణగా వేసిన కాంక్రీట్ అడ్డుగోడను ఢీకొని, ఆపై చెత్త తరలించే వాహనాన్ని డీకొంది. ప్రమాదానికి ముందు కారు మూడు లైన్లను దాటిందని, నిమిషాల్లోనే రెస్క్యూ టీమ్ ఘటనా స్థలికి చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిందని వివరించారు.

More Telugu News