: 500 టన్నుల సరుకులతో చైనా నుంచి కరాచీకి బయల్దేరిన రైలు

చైనా చిరకాల వాంఛ నెరవేరింది. పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో పాకిస్థాన్-చైనా ఎకనామిక్ కారిడార్ పేరిట చైనాకు రహదారి, రైలు మార్గం నిర్మించిన సంగతి తెలిసిందే. రోడ్డు మార్గనిర్మాణం కొనసాగుతుండగా, రైలు మార్గం పూర్తైంది. దీంతో నేడు చైనాలోని యూనన్ ప్రావిన్స్ నుంచి పాకిస్థాన్ లోని కరాచీకి 500 టన్నుల సరుకులతో చైనా రైలు బయల్దేరింది. పాక్ లోని గదార్ పోర్టుకు ఇవి చేరుకోనున్నాయి. గతంలో సముద్రమార్గంలో వస్తురవాణా చేయాలని చైనా భావిస్తే భారత్ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీంతో పలు ఆఫ్రికా దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం చైనాకు కష్టంగా మారింది. దీంతో పాక్ కు తాయిలాలు ప్రకటించి, ఈ నూతన కారిడార్ ను రూపొందించారు. మూడువేల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ కారిడార్ తో చైనా-పాక్ మధ్య సంబంధాలే కాకుండా, రవాణా సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కూడా సమకూరడం విశేషం.

More Telugu News