: ఇన్‌స్టాగ్రామ్‌ అంటేనే నరకం: ప్రముఖ పాప్‌స్టార్‌ జస్టిన్‌ బీబర్‌

ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రముఖ పాప్‌స్టార్‌ జస్టిన్‌ బీబర్‌(22) అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఆయ‌న‌కి అందులో కోట్లలో ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే, ఆయ‌న ఈ మ‌ధ్యే త‌న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తొల‌గించాడు. దానికి పెద్ద కార‌ణ‌మే ఉంది. త‌న ప్రియురాలు సోఫియా రిచీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న ఫాలోవ‌ర్లు ప‌లు ర‌కాలుగా కామెంట్స్‌ చేస్తుండ‌డంతో బీబ‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. బీబ‌ర్ ఇక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫొటోల‌ను ఉంచ‌బోడ‌ని తెలిసి ఆయ‌న‌ అభిమానులు ఎంత‌గానో బాధపడిపోతున్నారు. ఇటీవల ఆయ‌న యూకే వెళ్లగా అక్క‌డ ఆయ‌న‌ అభిమానులు బీబ‌ర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌ళ్లీ చేరుతావా? అని ప్ర‌శ్నించారు. ఇందుకు బీబర్ స‌మాధానం చెబుతూ... ఇన్‌స్టాగ్రామ్ ఉన్న‌ది దెయ్యాల కోసమేన‌ని వ్యాఖ్యానించాడు. ఆ యాప్ అంటేనే న‌ర‌కం అని, 90 శాతం పక్కాగా చెబుతున్నాన‌ని అన్నాడు. అది మనల్ని సర్వర్‌లో లాక్‌ చేసేసి నరకంలో పడేస్తుందిని వ్యాఖ్యానించాడు.

More Telugu News