: ప్రజలు నగదు కోసం ఎదురుచూడకుండా వేరే మార్గాల వైపు మళ్లాలి: సీఎం చంద్రబాబు

ప్రజలు నగదు కోసం ఎదురుచూడకుండా వేరే మార్గాల వైపు మళ్లాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సూచించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న సామ‌న్యుల క‌ష్టాల‌ను గ‌ట్టెక్కించే క్రమంలో రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే అంశంపై ఆయన ఈ రోజు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మొబైల్ ద్వారా లావాదేవీలు జ‌రిపేలా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆయ‌న సూచించారు. బ్యాంకు సిబ్బందికి ఉద్యోగులు, ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని చంద్రబాబు కోరారు. న‌గదు కొర‌త ఇబ్బందులను అధిగ‌మించేందుకు న‌గ‌దుర‌హిత లావాదేవీల‌పైపు మ‌ళ్లాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు. బ్యాంకుల వ‌ద్ద సిబ్బందిని మ‌రింత‌ పెంచాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. ఆన్‌లైన్ లావాదేవీల‌పై వర్క్‌షాపులు, శిక్ష‌ణ శిబిరాలు నిర్వహించాలని సూచించారు.

More Telugu News