: ఉద్యోగులకు నోట్ల రద్దు కష్టాలు, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకుకు చేరని డబ్బు... వెలగపూడిలో గందరగోళం

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు నేడు నగదు అందలేదు. ఉదయం 10 గంటలకు బ్యాంకులు తీసే సమయానికే ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు నగదు విత్ డ్రా కోసం క్యూ కట్టగా, 11 గంటల వరకూ క్యాష్ రాకపోవడంతో గందరగోళం నెలకొంది. వెలగపూడిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్ లకు నగదు అందలేదు. ఏ సమయానికి క్యాష్ అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని బ్యాంకు అధికారులే వెల్లడించలేని పరిస్థితి నెలకొంది. సచివాలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వందలాది మంది డబ్బుల కోసం బ్యాంకులకు వచ్చి వెనుదిరుగుతున్నారు. వెంటనే క్యాష్ పంపే ఏర్పాట్లు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కాగా, సచివాలయంలో ఎస్బీఐ ప్రత్యేక ద్వారా ప్రతి ఉద్యోగికీ రూ. 10 వేల వంతున పంచేందుకు ఏర్పాట్లు చేసింది.

More Telugu News