: విమానాశ్రయాలు, మల్టీప్లెక్స్ లలో కూడా ఎమ్మార్పీకే వస్తువులను అమ్మాలి

మల్టీప్లెక్స్ లో సినిమా చూడ్డానికి వెళ్లే వారికి అసలు ఖర్చు కంటే, కొసరు ఖర్చే ఎక్కువగా ఉంటుంది. ఓ వాటర్ బాటిల్ కొనాలన్నా, కూల్ డ్రింక్ తాగాలన్నా, చిప్స్, పాప్ కార్న్ కొనాలన్నా జేబు గుల్ల చేసుకోవాల్సిందే. భారీ రేట్లకు వీటిని అమ్ముతుంటారు. ఇకపై ఇలాంటి దందాకు చెక్ పడబోతోంది. విమానాశ్రయాలు, మల్టీప్లెక్స్ లలో వాటర్ బాటిల్ అయినా, ప్యాక్ చేసిన ఏ ఆహార వస్తువయినా ఎమ్మార్పీకే అమ్మాలని కేంద్ర వినియోగదారుల శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారం సక్రమంగా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలంటూ... రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏ వస్తవుకైనా ఒకే ఎమ్మార్పీ ఉంటుందని... రెండు ఎమ్మార్పీలు ఉండవని తన ఆదేశాల్లో తెలిపింది. తమ ఆదేశాలను కాదని ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయాలు జరిపితే... కఠిన చర్చలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

More Telugu News