: 'ల్యాండింగ్ కు దయచేసి అనుమతించండి'... వేడుకున్న ఫుట్ బాల్ ఆటగాళ్ల విమానం పైలెట్... ససేమిరా అన్న ఏటీసీ

ఓ ఫుట్ బాల్ జట్టులోని సభ్యులంతా మరణించడానికి కారణమైన విమాన ప్రమాదం వెనుక అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. 81 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం కుప్పకూలగా, 76 మంది అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. బ్రెజిల్ కౌంటీ సాకర్ టీమ్ ను తీసుకు వెళుతున్న విమానం కుప్పకూలిన ఘటనపై విచారణ జరిపిన అధికారులు, బ్లాక్ బాక్స్ వివరాలు విశ్లేషించారు. విమానం కూలిపోతున్న సంగతి పైలట్ కు ముందే తెలుసునని, చాలాసార్లు ఏటీసీని కాంటాక్ట్ చేసి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరాడని అధికారులు తెలిపారు. అధికారులు ల్యాండింగ్ కు ససేమిరా అనుమతించలేదని, ఈ కారణంతోనే విమానం చాలా సేపు ప్రమాదకరంగా గాల్లోనే ఉండి కుప్పకూలిందని ప్రాథమికంగా వెల్లడైనట్టు తెలుస్తోంది. కాగా, దాదాపు 50 వేల మంది ప్రజలు తమ టీముల జెర్సీలు ధరించి మృతులకు నివాళులు అర్పించారు. ఈ ఘటన ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటని, సాకర్ కుటుంబానికి దుర్దినమని అభిమానులు వాపోయారు.

More Telugu News