: ఏపీలో కొత్త విద్యుత్ ఛార్జీలు.. వచ్చే ఏడాది నుంచి అమలు

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ‘డిస్కం’ల ప్రతిపాదనలను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి అంగీకరించింది. ఏపీలో కొత్త విద్యుత్ ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలు కానున్నాయి. పెరిగిన కొత్త విద్యుత్ ఛార్జీలను త్వరలో ప్రకటిస్తారు. కాగా, ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి 2017-18 వార్షిక నివేదికలను డిస్కంలు సమర్పించాయి. 2017-18 ఏడాదికి విద్యుత్ ఉత్పత్తి ఖర్చు రూ.30,069 కోట్లు, ప్రస్తుత ఛార్జీలపై వచ్చే ఆదాయం రూ.22,892 కోట్లు, రెవెన్యూ లోటు రూ.7,177 కోట్లు, యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.5.94 పైసలు ఖర్చు కాగా, యూనిట్ విద్యుత్ పై వచ్చే ఆదాయం రూ.4.53, యూనిట్ విద్యుత్ పై రూ.1.42 పైసలు నష్టంగా ఉంది. రెవెన్యూ లోటు పూడ్చుకునే యోచనలో విద్యుత్ డిస్కంలు ఉన్నాయి

More Telugu News