: తెలంగాణాకు ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రభుత్వం కావాలి!: రేవంత్ రెడ్డి

‘తాగి కారు నడిపితేనే జైల్లో పెడుతున్నారే, మరి, తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ ను అండమాన్ జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందా? లేదా?' అంటూ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీపీ తలపెట్టిన పోరుయాత్ర ఈరోజుతో ముగిసింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాగిన మత్తులో రాత్రికి ఒక నిర్ణయం.. తెల్లవారిన తర్వాత మరో నిర్ణయం తీసుకుంటున్న వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. అందుకే, తెలంగాణ రాష్ట్రానికి చురుకైన నాయకత్వం, సామాజిక న్యాయం చేయగలిగిన పార్టీ కావాలని, పేద ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రభుత్వం కావాలని.. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం లేదని అన్నారు. నకిలీ ఉద్యమకారులందరిని తెలంగాణలో మంత్రులను చేసిన ఘనత కేసీఆర్ ది అని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేయాలని, కేంద్రం ఇచ్చిన రూ.790 కోట్ల ఇన్ పుట్ సబ్బిడీ రూపాయి కూడా రైతుకు అందలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

More Telugu News