: హైదరాబాద్‌లో మతిస్థిమితం లేని కోతి... పట్టుకోవడానికి ఆపరేషన్‌ షురూ

హైదరాబాద్‌లోని సైదాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో నివ‌సిస్తోన్న ప్ర‌జ‌ల‌కు కోతి భ‌యం ప‌ట్టుకుంది. పొద్దున్నే నిద్ర‌లేచి వీధుల్లోకి రావాలంటే అక్క‌డి ప్ర‌జ‌లు ఎక్క‌డ కోతి వ‌చ్చి క‌రుస్తుందోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఇటీవ‌లే ఆ ప్రాంతంలోకి కోతులు ప్ర‌వేశించ‌డంతో అధికారులు అక్క‌డి పార్కులు, ఇళ్లపైన జాలీలను ఏర్పాటు చేశారు. అయితే, ఆ ప్రాంతంలో మ‌తిస్థితిమితం కోల్పోయిన ఓ కోతి తరుచూ తిరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రాంత‌వాసులంతా దానినుంచి త‌ప్పించుకోవాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ ఒక్క‌ వాన‌రాన్ని ప‌ట్టుకునేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) సిబ్బంది త‌మ‌ కమిషనర్‌ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు క‌దిలారు. వారితో పాటు ఈ రోజు వెటర్నరీ, మున్సిపల్‌, జూపార్క్‌ సిబ్బంది కూడా ఆ కోతిని ప‌ట్టుకోవ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని వ‌చ్చారు. ఇప్పటివరకు స‌ద‌రు కోతి ఏకంగా 90 మందిని కరిచింది. కోతి భయంతో ఇప్ప‌టికే కొంద‌రు ఇళ్లు వదిలి వేరే ప్రాంతాల‌కు వెళ్లిపోయారు. ప్ర‌జ‌ల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్న‌ కోతిని త్వ‌ర‌లోనే బంధించి తీసుకెళ్తామ‌ని, ఆపరేషన్‌ ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు.

More Telugu News