: పాకిస్థాన్ కి బుల్లెట్ ట్రయిన్సా?: అంత సీన్ లేదన్న చైనా

పాకిస్థాన్ కు బుల్లెట్ ట్రయిన్స్ ను తీసుకొస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నవాజ్ షరీఫ్ ఇప్పుడు ఆ టాపిక్ ను పక్కన పెట్టేశారు. దానికి కారణం చైనా! ఈ విషయంపై పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి ఖవాజా సాద్‌ రఫీఖ్‌ మాట్లాడుతూ, చైనా- పాకిస్థాన్ కారిడార్ నిర్మాణం పూర్తయ్యాక 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ట్రాక్ లను చైనా నిర్మిస్తుందని అన్నారు. ట్రాక్ ఎలాగూ వేస్తున్నారు బుల్లెట్ ట్రైన్స్ కూడా ప్రారంభించవచ్చుకదా? అని చైనాను కోరితే ఆ దేశ అధికారులు పగలబడి నవ్వారని ఆయన తెలిపారు. అవమానించినంతపని చేశారని ఆయన చెప్పారు. పాక్ లో పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని, దీంతో బుల్లెట్ ట్రైన్స్ ను భరించగల ఆర్థిక స్థోమత పాక్ కు లేదని ఆయన తెలిపారు.

More Telugu News