: 'జనగణమన' కాకపోతే సోమాలియా జాతీయగీతం ప్రదర్శించాలా?: పరేశ్ రావల్

దేశంలోని అన్ని సినిమా థియేటర్లలో సినిమాకు ముందు జాతీయగీతాన్ని ప్రదర్శించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సినిమా చూడ్డానికి వచ్చిన అందరూ లేచి నిలబడి జాతీయగీతాన్ని గౌరవించాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరేమో ఇది మంచి నిర్ణయమని చెబుతుండగా... మరికొందరేమో దేశభక్తిని థియేటర్లలో ప్రదర్శించాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ స్పందించారు. థియేటర్లలో జాతీయ జెండాను చూపాల్సిందేనని... జాతీయగీతాన్ని ప్రదర్శించాల్సిందేనని ఆయన అన్నారు. థియేటర్లో మనది కాకపోతే సోమాలియా జాతీయగీతాన్ని ప్రదర్శించాలా? అని ప్రశ్నించారు.

More Telugu News