: బంగాళాఖాతంలో అల్పపీడనం... కురవనున్న వర్షాలు, పెరగనున్న వేడి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు, నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న వెల్లడించారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశాలున్నాయన్నారు. వాయుగుండం శ్రీలంక, తమిళనాడు వైపు కదిలే అవకాశముందని తెలిపారు. దీని ప్రభావంతో శీతలగాలుల తీవ్రత తగ్గుతుందని, ఉష్ణోగ్రతలు కొంత మేరకు పెరుగుతాయని అధికారులు వెల్లడించారు.

More Telugu News