: మొబైల్ కరెన్సీ, కార్డు ఆధారిత లావాదేవీలకు ప్రజలు అలవాటు పడాలి: సీఎం చంద్రబాబు

మొబైల్ కరెన్సీ, కార్డు ఆధారిత లావాదేవీలకు ప్రజలు అలవాటు పడాలని, ప్రస్తుతం నగదు అందుబాటులో లేనందున ఉన్న నగదునే సమర్థంగా వాడుకోవాలి అని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూపే, మాస్టర్, వీసా కార్డులు పాస్ యంత్రం ద్వారా లావాదేవీలు జరపాలని, చరవాణిల ద్వారా చెల్లింపులు జరిగేలా చూడాలని కోరారు. ఈ చర్యల అమలుకు రోజూ 13 వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నానని, ఆన్ లైన్ చెల్లింపులు 6 శాతం నుంచి 10 శాతానికి చేరాయని అన్నారు. నగదు రహిత లావాదేవీలు 1.12 కోట్లు జరిగాయని, నగదు రహిత లావాదేవీలపై ‘మన టీవీ’ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని, అవగాహన కోసం 1.2 కోట్ల మందికి సంక్షిప్త సందేశాలు పంపుతున్నామని చెప్పారు. బ్యాంకుల వద్ద రూ.1250 కోట్ల నగదు ఉందని, పెద్దనోట్ల రద్దు తర్వాత 86 శాతం డబ్బు చలామణిలో లేదని అన్నారు.

More Telugu News