: ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది: మంత్రి కేటీఆర్

పెద్దనోట్ల రద్దు మంచిదే అయినా అమలులో లోపాలు ఉన్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేని కోసం తీసుకున్నారనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేది. నోట్ల రద్దు వలన స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి, దేశానికి ఒనగూరే లాభం గురించి కేంద్రం చెప్పి ఉంటే బాగుండేది. కనీసం, పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత అయినా ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. అయితే, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగులబెట్టుకోం.. ఒక చెరువులో మొసలి ఉందని చెప్పి చెరువు ఎండబెడితే.. మొత్తం చేపలు చచ్చిపోయాయి. మేము ప్రధాన మంత్రికి చెప్పింది అదే. పెద్దనోట్ల రద్దు ఉద్దేశ్యం మంచిదే.. కానీ, ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయని ప్రధానికి చెప్పాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

More Telugu News