: ఈ నెల జీతంలో రూ. 10 వేలు నగదు రూపంలో అందుకోనున్న తెలంగాణ ఉద్యోగులు

పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు తీసుకోవడానికి ప్రజలు నానా ప్రయాసలు పడాల్సి వస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులే ఎక్కువగా దర్శనమిస్తుండటంతో ప్రజలు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు నగదు కోసం ఇబ్బంది పడకూడదని భావించిన సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీన ఉద్యోగులకు వారి జీతంలో పదివేల రూపాయల నగదును చేతికి ఇచ్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు అంగీకరించింది. ఉద్యోగుల కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్ కు వెళ్లినా నగదు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఆర్బీఐకి ఉద్యోగ సంఘాలు విన్నవించుకున్నాయి.

More Telugu News