: మోదీ సహా 22 మందిని చంపేందుకు ఉగ్రవాదుల కుట్ర

తమిళనాడులోని మధురైలో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురూ మైసూరు, కొల్లం, మలప్పురం, చిత్తూరు, నెల్లూరు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులు. వీరు ముగ్గురూ ఆల్ ఖైదా ఉగ్రవాదులుగా ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో 22 మంది నేతలను చంపేందుకు వీరు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. అంతేకాదు, దేశంలోని ఆరు కోర్టులను పేల్చేందుకు వీరు రెక్కీ నిర్వహించారని వెల్లడించారు. అరెస్టైన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ సుల్తాన్, కరీమ్, అబ్బాస్ అలీలుగా గుర్తించారు. పేలుడు పదార్థాలు, ఆయుధాలను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. అనంతరం వీరిని తదుపరి విచారణ కోసం మైసూరుకు తరలించారు.

More Telugu News