: ప్రధాని మోదీకి ‘8’ సెంటిమెంట్ నంబరా?

ప్రధాని నరేంద్ర మోదీకి ‘8’ సంఖ్యతో సెంటిమెంట్ ముడిపడి ఉందా? అంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం... * పెద్దనోట్ల రద్దును ప్రకటించిన తేదీ.. నవంబర్ 8వ తేదీ 8 గంటల సమయం * నరేంద్ర మోదీ పుట్టిన తేదీ.. సెప్టెంబర్ 17 (1+7=8), 1950 * ప్రముఖ వెస్ట్రన్ న్యూమరాలజిస్ట్ పౌల్ సడోవ్ స్కీ ప్రకారం.. నరేంద్ర మోదీ సంఖ్య ‘8’. ఇంగ్లీషులో నరేంద్రమోదీ పేరులోని మొత్తం అక్షరాల సంఖ్య 12. న్యూమరాలజీ ప్రకారం వాటి విలువ 62. వాటి మొత్తం 6+2=8. * ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసమైన 7, రేస్ కోర్స్ రోడ్ పేరును లోక్ కల్యాణ్ మార్గ్ గా ఇటీవల మార్చారు. ఛల్దియన్ క్యాలెండర్ ప్రకారం..‘లోక్ కల్యాణ్ మార్గ్’ న్యుమరికల్ విలువ ‘8’. * మోదీ ప్రారంభించిన స్వావలంబన్ అభియాన్ పథకం ప్రారంభించింది.. సెప్టెంబర్ 17(1+7=8), 2014. * సార్క్ సమావేశాలు ప్రారంభించింది..నవంబర్ 26 (2+6=8),2014 * గుజరాత్ లో పరవసీ భారతీయ దివస్ ప్రారంభించింది జనవరి 8, 2015 * ప్రధాన మంత్రి ముద్రా యోజన ప్రారంభించింది ఏప్రిల్ 8, 2015 * మోదీ డ్రీమ్ ప్రాజెక్టు.. డిజిటల్ ఇండియాను ప్రారంభించింది సెప్టెంబర్ 26(2+6=8), 2015. వీటన్నింటిని పరిశీలిస్తే ప్రధాని మోదీకి ‘8’ సంఖ్యతో సెంటి మెంట్ ముడిపడి ఉందని ఆ కథనంలో పేర్కొంది.

More Telugu News