: డాలర్ తో రూపాయి మారకపు విలువ 70 దాటుతుంది!: తాజా నివేదిక

అమెరికన్ డాలర్ తో రూపాయి మారకపు విలువ మరింతగా పతనం కానుందని ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ డ్యూష్ బ్యాంక్ రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది. డిసెంబర్ నాటికి రూపాయి విలువ రూ. 70ని దాటి ఆల్ టైం రికార్డు గరిష్ఠానికి, ఆపై 2017 చివర్లోగా రూ. 72.50ని దాటుతుందని పేర్కొంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తరువాత కరెన్సీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, ముఖ్యంగా ఇండియా వంటి దేశాలపై ఒత్తిడి అధికంగా ఉందని బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. యూఎస్ ఫెడ్ తీసుకునే నిర్ణయాల కారణంగా డాలర్ మరింతగా బలపడనుందని అంచనా వేస్తూ, 2017-18లో భారత జీడీపీ కేవలం 1.1 శాతం మాత్రమే పెరగనుందని తెలిపింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ పతనం వ్యవస్థపై బలహీన సంకేతాలు పంపుతోందని డ్యూష్ హెచ్చరించింది. ఇదిలావుండగా, నేటి ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మారకపు విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 11 పైసలు మెరుగుపడి రూ. 68.57 వద్ద కొనసాగుతోంది.

More Telugu News