: పెద్దనోట్ల రద్దు ఇబ్బందుల నివారణకు చర్యలు తీసుకోండి: సీఎం కేసీఆర్ ఆదేశాలు

పెద్దనోట్ల రద్దుతో తలెత్తుతున్న ఇబ్బందుల నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు సహాయకారిగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పెద్దనోట్ల రద్దు అనంతర పరిణామాలపై, రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రగతి భవన్ లో ఆయన సమీక్షించారు. పెద్దనోట్లు రద్దుతో కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించేందుకు అధికారులు, మంత్రులు సూచనలు చేయాలని కోరారు. భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. నగదు రహిత లావాదేవీల విధివిధానాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ చంద్ర, శాంతికుమారి, నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, రంగారెడ్డి, సూర్యాపేట కలెక్టర్లు రఘునందన్, సురేంద్ర మోహన్ ఉన్నారు.

More Telugu News