: ఇక రూపాయి కూడా జేబులో వద్దు: మోదీ

దేశ ప్రజలు ఒక్క రూపాయిని కూడా జేబులో ఉంచుకోకుండా, దేశమంతా తిరిగి వచ్చే రోజులు త్వరలో రానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కరెన్సీ కాగితాలతో పనిలేకుండా అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానం సహాయాన్ని ఉపయోగించుకుంటూ ఈ-బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ విధానాలను విరివిగా ఉపయోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండియా పేమెంట్ టెక్నాలజీ దిశగా కీలకమైన ముందడుగు వేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డ మోదీ, మన్ కీ బాత్ లో భాగంగా ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరూ సాధ్యమైనన్ని ఎక్కువ చెల్లింపులను నగదు రహితంగా చేయాలని అన్నారు. కూరగాయల మార్కెట్ నుంచి బడ్డీ కొట్టు వరకూ చిన్న చిన్న దుకాణాల్లో కూడా స్వైపింగ్ మెషీన్లు వస్తున్నాయని, చిల్లర చెల్లింపులకూ కార్డునే వాడుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు యువత మొబైల్ బ్యాంకింగ్ ను అందిపుచ్చుకోవాలని కోరారు.

More Telugu News