: డబ్బు కోసం 80 మంది సొంతవారిని చంపిన 24 ఏళ్ల ఉగ్రవాది!

అబ్బాస్ సబానీ (24)... అమాయకమైన ముఖంతో, చేతికి సంకెళ్లతో ఇరాక్ లోని కిర్కుక్ నగరంలో రోడ్డుపై కూర్చున్న వ్యక్తి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిర్కుక్ పై దాడి చేసిన వేళ, అతనితో చేతులు కలిపి, సొంతవారని కూడా చూడకుండా 80 మందిని హత్య చేశాడన్నది కుర్దిష్ వర్గం సబానీపై చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణలపై అతనికి పడే శిక్ష మరణదండనే. ఇంత పని ఎందుకు చేశావని అడిగితే, సబానీ నుంచి వచ్చే సమాధానం ఒకటే. కేవలం డబ్బుకు ఆశపడ్డానని అతను చెబుతాడు. తన గ్రామం ఎంతో పేదదని, తన కుటుంబం ఇంకా పేదదని, డబ్బు కోసమే ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు. తాను మరణిస్తే, కుటుంబ సభ్యులకు పూర్తి అండగా ఉంటామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చెప్పారని, ఆత్మాహుతి దాడి చేసి మరణిస్తే, స్వర్గానికి వెళ్లవచ్చని చెప్పారని, అయితే, తాను భయంతో మెషిన్ గన్ తో కాల్పులకు దిగానని అన్నాడు. తనతో పాటు ఎంతో మంది బాంబులున్న జాకెట్లు ధరించి దాడులకు పాల్పడ్డారని, వీరంతా మరణించారని చెప్పాడు. ఇప్పుడు సబానీని ప్రాణాలతో బంధించిన కుర్దిష్ సైన్యం, అతన్ని చట్టం ముందు నిలిపింది.

More Telugu News