: యాసర్ అరాఫత్ అలిగిన వేళ... క్యాస్ట్రోను తీసుకెళ్లిన ఇందిరాగాంధీ... ఓ మధుర ఘటన!

అది 1983... ఢిల్లీలో అలీనోద్యమ సదస్సు జరుగుతున్న సమయం. దాదాపు 100కు పైగా దేశాల నుంచి ప్రధానులు, అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సదస్సులో పాలస్తీనా విమోచన ఉద్యమ నేత యాసర్ అరాఫత్ అలక వహించి, సదస్సును బహిష్కరించాలని భావించారు. అదే జరిగితే, ఇండియాకు చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ, తనను సోదరి సమానురాలిగా చెప్పుకునే ఫిడేల్ క్యాస్ట్రోను వెంటబెట్టకుని అరాఫత్ వద్దకు వెళ్లారు. అరాఫత్ తో క్యాస్ట్రో మాట్లాడుతూ, "మిత్రమా.. ఇందిర నీ స్నేహితురాలేనా?" అని అడిగారు. అందుకు అరాఫత్ స్పందిస్తూ, "ఆమె నా పెద్దక్కతో సమానం. ఆమె కోసం ఏమైనా చేస్తా" అన్నారు. "అయితే, మంచి తమ్ముడిలా సదస్సులో పాల్గొను" అని క్యాస్ట్రో చెప్పగా, మరో ఆలోచన లేకుండా సదస్సును కొనసాగించారు అరాఫత్. ప్రపంచ విప్లవోద్యమ నేతలు సైతం ఇందిరాగాంధీని సోదరిగా భావించి గౌరవిస్తారని చెప్పడానికి 1983 అలీనోద్యమ సదస్సు వేదిక సాక్ష్యంగా నిలిచింది.

More Telugu News