: మీడియా దృష్టి మరల్చేందుకే మా సంస్థను నిషేధించారు: ప్రభుత్వానికి జకీర్ నాయక్ లేఖ

తన సంస్థపై ప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించడంపై ఇస్లాం వివాదాస్పద మతగురువు జకీర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) ప్రతినిధితో లేఖను విడుదల చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై భారత ప్రభుత్వం ఒక్కసారి కూడా విచారించకుండా ఐదేళ్ల నిషేధం విధించడం మతపరమైన చర్య అని అన్నారు. తనను చిక్కుల్లో పడేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు సమయంలోనే తన సంస్థపై నిషేధం విధించడానికి కారణం మీడియా దృష్టి మరల్చేందుకేనని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై దాడులు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు ఐఆర్ఎఫ్ ఖాతాలన్నీ స్తంభింపజేసిన సంగతి తెలిసిందే.

More Telugu News