: ఆకట్టుకున్న టీమిండియా బౌలర్లు... 268/8 పరుగుల వద్ద ముగిసిన తొలిరోజు ఆట!

మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టో, బట్లర్ రాణించడంతో ఆకట్టుకునే స్కోరు సాధించింది. పేసర్లకు అనుకూలించే పిచ్ పై స్పిన్నర్లు కూడా రాణించడంతో తొలిరోజు ఆటలో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ఆదిలో తడబడింది. ఓపెనర్ హమీద్ (9) విఫలమయ్యాడు, అనంతరం వచ్చిన జో రూట్ (15) కూడా ఆకట్టుకోలేకపోయాడు. వరుసగా రెండు వికెట్లు పడడంతో తడబడ్డ ఓపెనర్, కెప్టన్ కుక్ (27) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో నిలదొక్కుకున్నాడు. అనంతరం వచ్చిన మొయిన్ అలీ (16) విఫలమయ్యాడు. దీంతో బెన్ స్టోక్స్ (29) కూడా స్ట్రోక్స్ ఆడలేక పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్ (43) నిలదొక్కుకోవడంతో బెయిర్ స్టో (89) ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. ఈ ఇద్దరూ భారీ స్కోరు దిశగా సాగుతున్న దశలో మరోసారి జట్టు కుదుపుకులోనైంది. వీరిద్దరూ ఔటవడంతో వోక్స్ (25) ఏకాగ్రత చెదిరి పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులో రషీద్ (4), బెట్టీ (0) క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్ చెరి రెండు వికెట్లతో ఆకట్టుకోగా, అశ్విన్, షమి చెరో వికెట్ తీసి వారికి సహకరించారు.

More Telugu News